అణు ఒప్పందం మరో అయిదేళ్లు …..
అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని అగ్రరాజ్యం ప్రతిపాదించింది. ఈ అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయంలోనే పొడిగించడానికి కూడా వీలు కల్పించడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ ప్రెసె సెక్రటరీ జెన్ సాకీ మీడియాకి చెప్పారు. 2010లో బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఈ అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగియనుంది. దీని ప్రకారం ఒక్కో దేశం 1,500కి మించి అణు వార్హెడ్లను మోహరించడానికి వీల్లేదు. అమెరికా ప్రతిపాదనని రష్యా స్వాగతించింది. తాము కూడా ఒప్పందాన్ని పొడిగించడానికి సిద్ధం ఉన్నామని అమెరికా ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ చెప్పారు.






