అమెరికా ఎన్నికల బరిలో మరో భారతీయ అమెరికన్
జనరేషన్ జెడ్ తరానికి చెందిన భారత సంతతి యువతలో అమెరికా సెనేట్ పదవికి పోటీపడుతున్న తొలి వ్యక్తిగా అశ్విన్ రామస్వామి ( 24 ఏళ్లు) నిలిచారు. డెమోక్రాట్ అయిన ఆయన జార్జియా రాష్ట్ర సెనేట్‌కు పోటీ పడనున్నారు. ఒకవేళ గెలుపొందితే జార్జియా సెనేట్‌కు ఎన్నికయిన తొలి జెన్ జెడ్ యువకుడిగా, తొలి భారతీయ అమెరిన్ వ్యక్తిగా రామస్వామి రికార్డు సృష్టిస్తారు. తమిళనాడుకు చెందిన ఆయన తల్లిదండ్రులు 1990లో అమెరికాకు వలస వచ్చారు. చిన్నప్పటి నుంచి చిన్మయి మిషన్ ద్వారా ఆధ్యాత్మికతను అలవర్చుకున్న రామస్వామి, స్టాన్ఫర్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.






