Donald Trump: చైనాపై టారిఫ్ లు 80 శాతానికి తగ్గిదాం : ట్రంప్

చైనాపై విధించిన టారిఫ్‌లను 145 శాతం నుంచి 80 శాతానికి తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించారు. ఈ వారాంతంలో అమెరికా(America), చైనా(China) వాణిజ్య అధికారుల మధ్య సమావేశానికి ముందు ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. చైనా ఉత్పత్తులపై ట్రంప్ భారీగా టారిఫ్ (Tariff)లను విధించాక, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ తర్వాత మొదటిసారిగా స్విట్జర్లాండ్ (Switzerland) లో ఇరు దేశాల అధికారులు చర్చలు జరపనున్నారు. చైనాపై 80 శాతం టారిఫ్ సరైనవని ట్రంప్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుత చైనాపై అమెరికా టారిఫ్‌లు 145 శాతం, అమెరికాపై చైనా టారిఫ్‌లు 125 శాతంగా ఉన్నాయి.