చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!

ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తి నేపథ్యంలో చైనాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి వ్యాప్తితో పాటు వివిధ అంశాల పట్ల డ్రాగన్ దుందుడు వైఖరికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైట్‍హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలే మెకానీ ఈ మేరకు కీలక వ్యాఖ్యాలు చేశారు. చైనాపై అధ్యక్షుడు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో ఇప్పుడే చెప్పలేను. అయితే సరైన సమయంలో చైనాపై తీసుకోనున్న చర్యలపై కొన్ని రోజుల్లోనే ఓ వార్త వినబోతున్నారు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను అని పేర్కొన్నారు.