సేతురామన్ నియామకానికి సెనెట్ అంగీకారం

ప్రవాస భారతీయుడు సేతురామన్ పంచనాథన్‍కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‍ఎస్‍ఎఫ్) డైరక్టర్‍గా సేతురామన్ పంచనాథన్‍ను నియమిస్తున్నట్లు యూఎస్ సెనేట్ ధ్రువీకరించింది. వైద్యేతర సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధనలు, విద్య వంటి అంశాలు ప్రతిష్టాత్మక ఎన్‍ఎస్‍ఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. ఎన్‍ఎస్‍ఎఫ్ వార్షిక బడ్జెట్ 7.4 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. తమిళనాడుకు చెందిన సేతురామన్ పంచనాథన్.. 1989లో కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‍లో పీహెచ్.డీ పూర్తి చేశారు. ఎన్‍ఎస్‍ఎఫ్ డైరెక్టర్‍గా జూలై 6న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా.. ఎన్‍ఎస్‍ఎఫ్ డైరెక్టర్‍గా సేతురమాన్ పంచనాథన్‍ను నియమిస్తున్నట్లు గత ఏడాది చివర ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆయన నియామకాన్ని యూఎస్ సెనేట్ ధ్రవీకరించింది. ఇదిలా ఉంటే.. ఎన్‍ఎస్‍ఎఫ్ డైరెక్టర్ పదవికి ఎంపికైన రెండవ ప్రవాస భారతీయుడిగా సేతురామన్ పంచనాథన్ గుర్తింపు పొందారు. 2010-13 మధ్య కాలంలో ఇండియన్-అమెరికన్ డాక్టర్ సుబ్రా సురేష్.. ఎన్‍ఎస్‍ఎఫ్ డైరెక్టర్‍గా పని చేశారు.