స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితేనే అధ్యక్షుడు అమోదిస్తారు

స్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరిగితేనే వాటి ఫలితాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదిస్తారని శ్వేత సౌధం ప్రకటించింది. ఎన్నికల్లో ఓడిపోతే ప్రశాంతంగా అధికారాన్ని బదిలీ చేయబోనని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. దీనిపై ప్రెస్ సెక్రటరీ మెక్ ఎన్నే మాట్లాడుతూ స్వేచ్ఛగా, నిజాయితీగా జరిగే ఎన్నికల ఫలితాలను అధ్యక్షుడు ఆమోదిస్తారు. అమెరికన్ల అభిప్రాయాలను గౌరవిస్తారు అని చెప్పారు. అయినా విజయం సాధించే వారు అధికారాన్ని ఎందుకు బదిలీ చేస్తారని ఎదురు ప్రశ్న వేశారు. ట్రంప్ ఓడిపోతే డెమొక్రాట్లే ఫలితాలను ఆమోదించరని వ్యాఖ్యానించారు.