ఇటు ఎన్నికలు.. అటు నిరసనలు

అమెరికాలో ఓవైపు రాజకీయం మరోవైపు జాత్యహంకార వ్యతిరేక నిరసనలు భగ్గుమంటున్నాయి. అధ్యక్ష పదవికి అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ నామినేషన్‍ను స్వీకరించారు. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అభ్యర్థిత్వాన్ని స్వీకరించిన సందర్భంగా వైట్‍హౌస్‍లోని సౌత్‍లాస్‍లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ గెలిస్తే అమెరికా స్వప్నాలను నాశనం చేస్తారనీ, డెమొక్రాట్లకు అధికారమివ్వడమంటే అరాచకవాదులకు స్వేచ్ఛనివ్వడమేనని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా ట్రంప్ రెండోసారి నామినేషన్ స్వీకరించడం గమనార్హం. ఇంకోవైపు నల్లజాతీయుల ఆగ్రహ జ్వాలలు ట్రంప్‍ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.