కరోనా నిబంధనలు ..ట్రంప్ విస్మరించడంపై విమర్శలు

వైట్‍హౌస్‍లో ఆవరణలో జరిగిన రిపబ్లికన్ సమావేశంలో కరోనా వైరస్ నిబంధనలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విస్మరించడంపై ప్రజారోగ్య వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున మాస్క్లు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా, ఈ సమావేశం సాగిందని విమర్శించారు. ఈ సమావేశానికి వచ్చిన 1500 మంది అతిధుల్లో కొందరు అనుకోకుండా కరోనాను తెచ్చుకోవడం లేదా మరొకరికి వ్యాపింప చేయడం జరుగుతుందని ధ్వజమెత్తారు. ఈ సమావేశానికి వచ్చిన వారిలో ఎవరికి కరోనా ఉందో ఎవరికీ తెలియదని, ఈ వ్యక్తులు ఒకరి తరువాత మరొకరికి వైరస్ సంక్రమింప చేసి తమ ఇంటికి వెళ్లిపోతారని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ లీనా వెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష అభ్యర్థిత్వ నియామకాన్ని అంగీకరిస్తూ ట్రంప్ తన ప్రసంగంలో కరోనా వైరస్ జాగ్రత్తలు, భద్రత నిబంధనలపై విసుగును ప్రదర్శిచడం విమర్శలకు దారి తీసింది.