డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా మహిళా ఉద్యమం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍పై మహిళ లోకం కన్నెర చేసింది. దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేట్ జస్టిస్ రుత్ బదేర్ గిన్‍బర్గ స్థానంలో అమీ కానే బర్రేట్‍ను తీసుకువచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రుత్ బదేర్ జ్ఞాపకార్ధంగా, కంజర్వేటివ్ అప్పీలేట్ జడ్జి కానే బర్రేట్‍ను ట్రంప్ నామినేట్ చేయడాన్ని వ్యతిరేకంగా రాజధాని వాషింగ్టన్‍తో పాటు అన్ని రాష్ట్రాల్లోని నగరాల్లో మహిళలు వేలాది ర్యాలీలు చేశారు. వాషింగ్టన్‍లోని సుప్రీంకోర్టు భవనం వైపునకు ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు.
వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‍ను ఓడించాలని ఈ సందర్భంగా మహిళలు పిలుపునిచ్చారు. మహిళ హక్కుల లిజరల్ ఛాంపియన్ అయిన గిన్‍బర్గ సెప్టెంబర్ 18న మరణించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బర్రేట్ నామినేషన్‍ను ఫైనల్ చేసేందుకు రిపబ్లికన్లు తహతహలాడుతున్నారని ఆందోళకారులు విమర్శించారు. 2016 ఎన్నికలకు ఆరు నెలలకు ముందే మెర్రిక్ గార్లాండ్‍ను నామినేట్ చేసేందుకు అప్పటి అధ్యక్షుడు ఒరాక్ ఒబామా తిరస్కరించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బర్రేట్ నామినేషన్‍పై ఓటింగ్ నిర్వహించేందుకు అమెరికా సెనేట్ జుడిషియరీ కమిటీ ఈ నెల 22వ తేదీని నిర్ణయించింది.