కరోనా పై మిలిటరీ వర్గాల నుద్దేశించి ట్రంప్ హెచ్చరిక

మంగళవారం, 20 జులై న వైట్ హౌస్ నుంచి అద్ధ్యక్షులు ట్రంప్ వివిధ అంశాలపై స్పందిస్తూ ముఖ్యంగా కరోనా వైరస్ పై మాట్లాడుతూ “బహుశా కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడకముందే దురదృష్టవశాత్తు కరోనా వైరస్ శాపంగా మారనుంది. మీరు మాస్క్ ధరించటం ఇష్టమున్నా, లేకపోయినా ధరించాలి. మాస్క్ కరోనా వైరస్ పై ప్రభావం చూపుతుంది, ఇది మనకి ఇప్పుడు చాలా అవసరం.” అని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే కరోనా వైరస్ మరణాలు లో అమెరికా పదో స్థానంలో ఉండగా “ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అమెరికా తక్కువ మరణాల రేటును కలిగి ఉంది. అని అద్ధ్యక్షులు ట్రంప్ చెప్పడం గమనార్ధం మరియు అద్ధ్యక్షులు ట్రంప్ ప్రతికూల ఓటింగ్ పెరగడంతో ఇలా చెప్పుకొచ్చినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు.
న్యూ యార్క్ టైమ్స్ డేటాబేస్ ప్రకారం మంగళవారం 21 జూలై 1000 కి పైగా కరోనా వైరస్ మరణాలని అమెరికా నమోదు చేసింది ఇది మే 29 తరవాత మొదటిసారి. జూన్ నుంచి కొత్త కరోనా వైరస్ కేసులు మరియు కరోనా వైరస్ మరణాలు బాగా ఎక్కువ అయ్యాయి ఇది “స్టే ఎట్ హోమ్” మరియు లాక్ డౌన్ సదలింపు వలననే అని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారుఇది ఇలా ఉండగా సోమవారం నాటికి అమెరికన్ మిలటరీలో 21,909 కేసులు నమోదయ్యాయి, జూన్ 10 న 7,408 కేసులు నమోదుకాగా పెంటగాన్ ప్రకారం విమాన వాహక నౌక థియోడర్ రూజ్‌వెల్ట్‌లోని నావికుడితో సహా మార్చి నుండి ముగ్గురు సైనికులు మరణించారు. 440 మందికి పైగా సైనికులు ఆసుపత్రి లో చేరారు. అంటే అమెరికన్ మిలటరీలో సంక్రమణ రేటు గత ఆరు వారాలలో మూడు రెట్లు పెరిగింది. అరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా మరియు టెక్సాస్‌లలోని సైనిక స్థావరాలు లో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందినట్టు తెలిసింది. జపాన్లోని ఒకినావా, యు.ఎస్. మెరైన్ కార్ప్స్ లోని అమెరికన్ మిలటరీలో దాదాపు 100 కేసులు నమోదు అయినట్లు ప్రకటించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ మరియు సిరియా వంటి యుద్ధ ప్రాంతాలలో, అమెరికన్ మిలటరీలో ఇప్పటికే గుర్తించబడని కేసులతో, కరోనా వైరస్ విస్తృతంగావ్యాప్తి చెందింది అని లోకల్ అధికారులు చెప్పినట్టు తెలిసింది.