టిడిఎఫ్ ఫాదర్స్ డే వేడుకలు-పేదలకు ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ

తెలంగాణ డెవలప్‍మెంట్ ఫోరం (అమెరికా) ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన ఫాదర్స్ డే వేడుకలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సంస్మరణ దినోత్సవాన్ని టీడిఎఫ్ నిర్వహించింది. ఈ సందర్భంగా టీడిఎఫ్ వాషింగ్టన్ డి.సి ఆధ్వర్యంలో ఆహార పంపణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడిఎఫ్ అమెరికా అధ్యక్షురాలు కవితా చల్లా మాట్లాడుతూ, కోవిడ్ 19 సంక్షోభ సమయంలో పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని దాతలు, వలంటీర్ల సహాయంతో ఘనంగా నిర్వహించాము. రాక్‍విల్లే, ఎండిలో ఉన్న హోమ్ బిల్డర్స్ కేర్ అసెస్‍మెంట్ (HBCAC) లో ఉన్న పేదలకు ఆహార ప్యాకెట్లను టీడిఎఫ్ పంపిణీ చేసింది. టి.డి.ఎఫ్ సభ్యుల సహకారంతో అత్యవసర వసతి గృహంలో వున్న వారికి తత్వా రెస్టారెంట్ వారు సమకూర్చిన ఆహరంను ఇతర సభ్యుల ఆర్ధిక సహకారం తో పంపిణీ చేశామని కవితా చల్లా తెలిపారు.
స్వరూప్ కూరెళ్ల ఆధ్వర్యం లో సేవ (SEWA), టి.డి.ఎఫ్ సంయుక్తంగా ఫాదర్స్ డే నాడు చాలా మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా టి.డి.ఎఫ్ సభ్యుల సహకారంతో ఇలాంటి సాంఘీక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటుందని కవితా చల్లా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన టి.డి.ఎఫ్ డి.సి కో ఆర్డినేటర్ జీనత్ కుండూర్, రజని కొప్పారపు, శివాని రెడ్డి, ప్రతిభా కొప్పులకు కవితా చల్లా టీడిఎఫ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమానికి సహకరించిన టీడీఎఫ్ వర్జీనియా కోఆర్డినేటర్ రామ్మోహన్ సూరినేని, టీడీఎఫ్ వర్జీనియా కోశాధికారి హర్షా రెడ్డి, టీడీఎఫ్ డి.సి సలహాదారు సుధీర్ బండారు, రవి పల్ల (టీడిఎఫ్ వైస్ ప్రెసిడెంట్), టీడిఎఫ్ బోర్డ్ ట్రస్టీ శ్రీకాంత్ ఆరుట్ల, స్వరూప్ కూరెళ్ల (సేవా ఆర్గనైజషన్) తదితరులకు టీడిఎఫ్ ఫేస్‍బుక్, టీడిఎఫ్ వెబ్‍సైట్ ద్వారా కూడా విరాళాలు అందించిన అందరికీ ధన్యవాదాలను టీడిఎఫ్ అధ్యక్షురాలు కవితా చల్లా తెలిపారు.