అధ్యక్ష ఎన్నికల్లో ఆ రాష్ట్రాలే కీలకమట!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 50 అమెరికన్ రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. చాలా వాటిలో విజయావకాశాలపై ప్రధాన పార్టీలు రిపబ్లికన్, డెమోక్రటిక్‍ల అంచనాలు సృష్టంగానే ఉన్నాయి. ఈ విధంగా ఏదో రాజకీయ పార్టీనే గెలిపిస్తూ వస్తున్న రాష్ట్రాలను అమెరికాలో సేఫ్ స్టేట్స్ అని పిలుస్తారు. కాగా, కొన్నిటిలో జయాపజయాలు లెక్కలకందకుండా ఉండటంతో అభ్యర్థులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఊగిసలాడే ఫలితాలకు పెట్టింది పేరు కావటంతో వీటిని స్వింగ్ స్టేట్స్ అంటారు. ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉంటుందని భావించే 12 స్వింగ్ స్టేట్స్ లో ఫ్లోరిడాతో సహా అరిజోనా, జార్జియా, అయోవా, మెయిన్, మిషిగన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ హాంప్‍షైర్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విన్కాన్సన్‍లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల ప్రజలకు రాజకీయంగా సృష్టమైన అభిప్రాయలు ఉండటంతో జయాపజయాలు ఊహించటం చాలా కష్టమని భావిస్తారు. ఈ రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు అధ్యక్ష అభ్యర్థులు వీటిపై మరింత శ్రద్ధ కనపరుస్తుంటారు.