మంగళవారం ట్రంప్ మరియు బిడెన్ మధ్య మొదటి డిబేట్

అధ్యక్షులు ట్రంప్ మరియు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినీ జో బిడెన్ మధ్య జరిగే మూడు అధ్యక్ష చర్చలలో 29 సెప్టెంబర్ మంగళవారం సాయంత్రం ఇరు అభ్యర్థుల మధ్య మొదటి బహిరంగ ముఖా ముఖి అధ్యక్ష చర్చ జరగనుంది.క్లీవ్‌ల్యాండ్‌లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం లోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వేదికగా మంగళవారం 29 సెప్టెంబర్ రాత్రి 9 గంటల నుండి 10:30 గంటల వరకు ఈ మొదటి బహిరంగ ముఖా ముఖి అధ్యక్ష చర్చ జరగనుంది.
క్రిస్ వాలెస్ యాంకరింగ్ చేయనున్న ఈ చర్చలో ముఖ్యంగా అధ్యక్షులు ట్రంప్ మరియు మిస్టర్ బిడెన్ యొక్క రికార్డులు , సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం, ప్రపంచాన్ని కుదిపేసిన COVID-19 , అమెరికా ఆర్థిక వ్యవస్థ, జాతి వివక్షత కారణంగా అమెరికన్ నగరాల్లో చోటుచేసుకున్న హింస మరియు ఎన్నికల సమగ్రత మీద చర్చ జరగనున్నట్లు తెలిసింది. చర్చా విషయాలు వివాదాస్పదంగానే ఉన్నాయి అని మరియు చర్చ విషయాలలో వాతావరణ సంక్షోభం కూడా చేర్చాలి అని డెమొక్రాటిక్ సెనేటర్లు తెలిపినట్లు తెలిసింది.6 విషయాల పై 90 నిమిషాల పాటు జరిగే ఈ చర్చలో ప్రతి విషయానికి 15 నిమిషాలు సమయం కేటాయించనున్నారు అని నిర్వాహకులు తెలిపారు.
దేశ వ్యాప్తంగా నమోదు అయిన పోలింగ్ సగటు మరియు అనేక కీలక రాష్ట్రాల్ల పోలింగ్ లో ఆధిక్యత కనబరుస్తున్న మిస్టర్ బిడెన్ మరియు అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరికి ప్రతి అంశానికి ప్రారంభ ప్రశ్నకు ప్రతిస్పందించడానికి రెండు నిమిషాలు సమయం ఉంటుంది మరియు అభ్యర్థులు ఇరువురు ఒకరికొకరు స్పందించే అవకాశం లభిస్తుంది అని నిర్వాహకులు తెలిపారు.
మంగళవారం సెప్టెంబర్ 29 జరగనున్న చర్చ ఇరు ప్రధాన అభ్యర్థుల మధ్య జరిగే నాలుగు చర్చలలో మొదటిది కాగా అక్టోబర్ 7, అక్టోబర్ 15, అక్టోబర్ 22 తేదీల్లో మిగిలిన 3 చర్చలు జరగనున్నట్లు తెలిసింది.