కమలాహారిస్ వర్సెస్ మైక్ పెన్స్ మధ్య నువ్వానేనా

అమెరికా ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టానికి సమయం ఆస న్నమైంది. ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ముఖాముఖీ సంవాదం నేడు జరగనుంది. డెమో క్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిన్ అభ్యర్థి మైక్ పెన్స్ ముఖాముఖీలో ఏమి చెప్పనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూటా రాష్ట్రంలోని సాల్‍లేక్ సిటీ ఈ కార్యక్రమానికి వేదికగా నిలవనుం ది. యూఎస్‍ఏ టుడే పత్రికకు చెందిన సుసన్‍పేజ్ సంధానకర్తగా వ్యవహరించనున్నారు. అమెరికా చరిత్రలో ఓ ప్రత్యక్ష చర్చా కార్యక్రమంలో ఓ భారత సంతతి వ్యక్తి పాల్గొనడం ఇదే తొలిసారి. వీరువురి చర్చ అధ్యక్ష అభ్యర్థులు ఆధిక్యం సాధిం చేందుకు దో•హదం చేయనుంది. బైడెన్ బృందంలో హారిసే కీలక పాత్ర పోషించ నుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరివురి చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. అధ్యక్ష అభ్యర్థులు ప్రత్యక్ష చర్చలో పాల్గొన్న కొన్ని రోజుల కే ట్రంప్ కరోనా బారిన పడిన నేపథ్యంలోనేటి కార్యక్రమానికి జాగ్రత్తలు తీసుకుం టున్నారు. అభ్యర్థుల మధ్య గ్లాస్‍వాల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తూ, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారని సమాచారం.