రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్ పెన్స్

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరపున మైక్ పెన్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సదస్సునుద్దేశించి పెన్స్ మాట్లాడుతూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జియో బైడెన్ చైనా తొత్తు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్ చైనాకి చీర్ లీడర్ అయిన ఆయన లెఫ్ట్ పార్టీతో రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారని ఆరోపించారు. శ్వేతసౌధంలో మరో నాలుగేళ్లపాటు ట్రంప్ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. బైడెన్ అధికారంలోకి వస్తే చైనా కంపెనీలపై విధించిన సుంకాలన్నీ రద్దు చేయాలని చూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో చైనా నుంచి ప్రయాణాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్‍ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం పద్దతి అంటూ పెన్స్ విరుచుకుపడ్డారు. బైడెన్ నాయత్వంలో అమెరికన్లు సురక్షితం కాదన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియ ట్రంప్ ఆకస్మికంగా హాజరై పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్య పరిచారు.