డొనాల్డ్ ట్రంప్ కు కాపీరైట్ దెబ్బ…

ఎన్నికల ప్రచారంపై వైట్‍హౌజ్ ఓ వీడియోను రూపొందించింది. దీనిని శ్వేతసౌధం సామాజిక మాధ్యమ డైరెక్టర్ స్కావినో ట్విటర్‍లో పోస్టు చేశారు. ఈ వీడియోపై స్పందిస్తూ అధ్యక్షుడు ట్రంప్ రీ ట్వీట్ చేశారు. అనంతరం ఈ వీడియోపై లింకిన్‍పార్క్ అనే కంపెనీ అభ్యంతరం లేవనెత్తింది. తమ కంపెనీకి చెందిన ఆడియోను వాడారంటూ కాపీరైట్ నోటీసులు ఇచ్చింది. దీంతో ట్రంప్ రీ-ట్వీట్ చేసిన వీడియోను ట్విటర్ తొలగించింది. తాజా పరిణామంపై లింకిన్ పార్క్ స్పందించింది. తమ కంపెనీకి చెందిన ఆడియోను వాడుకునేందుకు ఓ సంస్థకు గానీ, వ్యక్తులకు గానీ అనుమతులు ఇవ్వలేదని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ రీ ట్వీట్ వీడియోపై అభ్యంతరం తెలియజేయడం జరిగిందని తెలిసింది. కాగా, ఈ అంశంపై అటు వైట్‍హౌజ్ కానీ, ట్రంప్ కానీ స్పందించలేదు.