వాషింగ్టన్ డిసి లో ఘనంగా యోగా కార్యక్రమం

కొవిడ్-19 నేపథ్యంలో అమెరికాలోని ఇండియన్ మిషన్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ ఏడాది వర్చువల్‍గా నిర్వహించింది. కొవిడ్-19 కారణంగా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో.. ఈ సారి యోగా కార్యక్రమాన్ని వర్చువల్‍గా జరపాలని నిశ్చయించుకుంది. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి’ పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ సైతం వర్చువల్‍గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో యూఎస్‍లోని ఇండియన్ అంబాసిడర్ తరాంజిత్ సింగ్ సంధు నివాసంలో కూడా భారత ప్రభుత్వం ప్రకటించిన విధంగానే వర్చువల్‍గా ఈ కార్యక్రమం జరిగింది. ఫ్రెండ్స్ ఆఫ్ యోగా, తదితర సంస్థల పార్ట్నర్‍షిప్‍తో ఈ కార్యక్రమాన్ని అమెరికాలో ఆర్గనైజ్ చేశారు. కాగా.. వర్చువల్‍గా పాల్గొన్న వారందరికి యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తరాంజిత్ సింగ్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యోగా మరింత అవసరం అని ఆయన అన్నారు. ఇండియన్ ఎంబసీకి చెందిన ఫేస్ బుక్, యూట్యూబ్ చానళ్ల ద్వారా వందలాది మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.