అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన భారతీయ అమెరికన్ల ఓట్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. ఇక్కడ వీరికి దాదాపు 13 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. ఒక్క పెన్సిల్వేనియాలోనే రెండు లక్షల మంది ఉన్నారు. మిషిగన్‍లో 1,25,000 మంది ఉన్నారు. ఈ రెండు చోట్ల గెలవడం ఏ పార్టీకైనా ముఖ్యం. దీంతో పాటు ఫ్లోరిడా, మిషిగన్, వర్జీనియా తదితర చోట్ల భారతీయ అమెరికన్లు ఎక్కువ. 2016 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‍కు దాదాపు 77 శాతం మేర భారతీయ అమెరికన్ల ఓట్లు లభించాయని అంచనా. మంచినేతగా పేరు తెచ్చుకున్న హారిస్ కచ్చితంగా బైడెన్‍కు పాలనలో మంచి భాగస్వామి అవుతారని హిల్లరీ క్లింటన్ అన్నారు.