అధ్యక్ష ఎన్నికలపై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్

ప్రజలు భద్రంగా, సురక్షితంగా ఓటేసే పరిస్థితులు వచ్చేదాకా అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్వీట్ చేసిన మరుసటి రోజే డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. తాను కూడా ఎన్నికల కోసం ఆత్రంగా ఉన్నానని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎన్నికల వాయిదా ప్రతిపాదనపై డెమోక్రాట్లు తీవ్ర అభ్యంతరం తెలపడంతో పాటు సొంత రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా మద్దతు లభించకపోవడంతో ఆయన మాట మార్చారు.