డెమోక్రాటిక్ అభ్యర్థిగా జో బైడెన్ పేరు ఖరారు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‍ను అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆన్‍లైన్‍లో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా అధ్యక్ష అభ్యర్థి 77 ఏళ్ల వయసున్న జో బైడెన్‍ను నామినేట్ చేశారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సాహసం కలిగిన నాయుడు బైడెన్ అని నేతలందరూ కొనియాడారు. నామినేట్ అయ్యా జో బైడెన్ తన జీవితంలో దక్కిన అతి గొప్ప గౌరవం ఇదేనని ట్వీట్ చేశారు. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‍ను అధికారికంగా ప్రకటించి అమెరికా ప్రజల గుండె చప్పుడు ఏంటో పార్టీ చెప్పిందని బైడెన్ సతీమణి జిల్ బైడెన్ భావోద్వేగానికి లోనయ్యారు. అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో ట్రంప్ కంటే బైడెన్ 7.7 పాయింట్లు అధికంగా సంపాదించి ముందంజలో ఉన్నారు.