రాకముందు ఎలా ఉన్నారో… అది వచ్చిన తర్వాత కూడా!

కరోనా రాకముందు ఎలా ఉన్నారో అది వచ్చిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏమీ మారలేదు. వైరస్‍పట్ల నిర్లక్ష్యాన్ని వీడలేదు. కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న ట్రంప్ పూర్తిగా కోలుకోకుండానే వాల్టర్ రీడ్ సైనిక దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. దవాఖాన నుంచి నేరుగా శ్వేతసౌధానికి చేరుకున్నారు. ముఖానికి మాస్కు లేకుండానే శ్వేతసౌధంలో కలియతిరిగారు. ఆ సమయంలో ఆయనతో కార్యాలయ సిబ్బంది కూడా మాస్కులు ధరించకుండా ఉన్నారు. గత 72 గంటల్లో ట్రంప్‍కు జ్వరం రాలేదని శ్వేతసౌధం వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే తెలిపారు. అయితే, ఆయన పూర్తిగా కోలుకున్నారని ఇప్పడే చెప్పలేమని శ్వేతసౌధంలో 24 గంటల పాటు నిరంతరం వైద్యుల పర్యవేక్షణను కొనసాగిస్తామన్నారు. పూర్తిగా కోలుకోకుండానే వైట్‍హౌస్‍లోకి అడుగుపెట్టిన ట్రంప్ నుంచి వైరస్ సోకకుండా తమను ఎలా కాపాడుకోవాలో తెలియక శ్వేతసౌధం సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వైట్‍హౌస్ మీడియా కార్యదర్శికి కరోనా సోకింది.