బైడెన్ కు ఓటేయ్యండి …. ఒబామా ఫోన్ కాల్

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. బైడెన్ తరపున ప్రచారం చేస్తున్న ఆయన డెమోక్రటిక్ అభ్యర్థికి ఓటేయ్యాలంటూ అభ్యర్థించారు. ఇటీవల అలిసా అనే ఓటరకు ఒబామా ఫోన్ కాల్ చేశారు. నా పేరు ఒరాక్ ఒబామా.. నేను దేశాధ్యక్షుడిగా చేశాను. ఇప్పుడు బైడెన్ తరపున ఫోన్ బ్యాంకింగ్ చేస్తున్నానని బరాక్ తన కాల్‍లో చెప్పారు. ఎన్నికల రోజున బైడెన్, కమలా హారిస్‍కు ఓటు వేయాలని ఒబామా ఆ మహిళా ఓటరు కోరారు. కావాలంటే పోలింగ్ బూత్ సమాచారం కూడా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. బైడెన్‍కు ఓటు వేయాలంటూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కు చెప్పాలని, బరాక్ గుర్తు చేసినట్లు చెప్పాలని ఆయన ఆ ఓటరుతో తెలిపారు. 8 నెలల చిన్నారితోనూ ఒబామా ఫోన్‍లో సంభాషించే ప్రయత్నం చేశారు. మాజీ దేశాధ్యక్షుడు నేరుగా ఓటర్లకు ఫోన్ చేసి ఓట్లు అడుగుతున్న ఈ వీడియో వైరల్‍గా మారింది.