బే ఏరియాలో తానా బ్యాక్ ప్యాక్ స్కూల్ బ్యాగ్ ల పంపిణీ

బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్‍ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బే ఏరియాలోని హెచ్‍ఎ స్నో ఎలిమెంటరీ స్కూల్‍లో ఈ స్కూల్‍బ్యాగ్‍ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 400 స్కూల్‍బ్యాగ్‍లను అందజేశారు. తానా మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తానా ట్రెజరర్ సతీష్ వేమూరి, జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి, రీజినల్ కో ఆర్డినేటర్ రజనీకాంత్ కాకర్ల, తానా ట్రస్టీ భక్తబల్లా, రామ్‍తోట, గోకుల్ రచిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికన్ కమ్యూనిటీలోని పేద పిల్లలకు సహాయపడాలన్న ఉద్దేశ్యంతో తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.