బే ఏరియాలో తానా-బాటా ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా)తో కలిసి ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని బే ఏరియాలో నిర్వహించింది. ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులను ఆదుకునేందుకు తానా బే ఏరియా టీమ్, బాటా టీమ్‍తో కలిసి ముందుకు వచ్చింది. దీపావళి నాడు ఫ్రీమాంట్‍లో జరిగిన ఫుడ్ డ్రైవ్ కార్యక్రమంలో తానా నాయకులు, బాటా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రీమాంట్‍లో ఉన్న టీసివి ఫుడ్ బ్యాంక్‍కు ఫుడ్ ఐటెమ్స్ ను అందజేశారు. మిల్‍పిటాస్‍లో కూడా ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిల్‍పిటాస్‍లోని ఫుడ్ బ్యాంక్‍కు ఆహారపదార్థాలను అందజేశారు.
ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని దాదాపు 10 నగరాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫ్రీమాంట్, నెవార్క్, యూనియన్ సిటీ, ట్రేసీ, డబ్లిన్, మిల్‍పిటాస్, ఓక్‍లాండ్, హేవార్డ్, ప్లజంటన్, మోడెస్టోలో ఈ కార్యక్రమాన్ని చేయనున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఫ్రీమాంట్, మిల్‍పిటాస్‍లో కార్యక్రమాలు జరిగాయన్నారు. తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి, తానా కేర్స్ టీమ్ జో పెద్దిబోయిన, తానా మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా నాయకులు సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, భక్త బల్లా, రజనీకాంత్ కాకర్ల, బాటా నాయకులు విజయ ఆసూరి, యశ్వంత్ కుదరవల్లి, హరినాథ్ చికోటి, కరుణ్ వెలిగేటి, ప్రసాద్ మంగిన, రామ్‍తోట తదితరులు పాల్గొన్నారు.