ఈ దివిలో విరిసిన పారిజాతం

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా)తో పద్మభూషణ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఎంతో అనుబంధం ఉంది. అమెరికాలో కచేరికి వచ్చినప్పుడు శాన్‍హోసెకి వెళితే పుట్టింటికి వెళ్ళినట్లు ఉంటుందని చెప్పేవారు. బాలుగారితో 40 ఏళ్ళుగా బాటాకు పరిచయం ఉంది. నాటి శంకరాభరణం రోజుల నుంచే ఆయన బాటా కమ్యూనిటీకి పరిచయం. గత 23 సంవత్సరాలలో బాటా నిర్వహించిన దాదాపు 15కిపైగా కచేరీలలో ఆయన పాల్గొన్నారు. బే ఏరియా తెలుగు కమ్యూనిటీని ఎంతో అభిమానించేవారు. బాటా ఆధ్వర్యంలో బాలు మృతికి సంతాపం తెలియజేస్తూ సంస్మరణ సభను నిర్వహించారు.
బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి మాట్లాడుతూ, బాలుతో బాటాకి ఎంతో అనుబంధం ఉంది. గొప్ప గాయకుడు బాలుగారు మృతి చెందడం దురదృష్టకరం. సంగీతాభిమానులకు మంచి గాయకుడిని కోల్పోయారన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాన్‍ఫ్రాన్సిస్కో ఇండియా కాన్సులేట్ సిజి టీ.వీ. నాగేందప్రసాద్, తానా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిటీ నాయకుడు జయరామ్ కోమటి, ప్రముఖ కార్డియాలజిస్ట్, దాత డాక్టర్ హనిమిరెడ్డి, వేణు ఆసూరిని ఆమె పరిచయం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలసుబ్రహ్మణ్యంగారితో తమకు ఉన్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. ఆయన ఎంత గొప్పవారైనా అందరితో కలిసిపోతారని, వినయంగా ఉంటారని, సాధారణ వ్యక్తిగా కనిపిస్తారని అన్నారు. ఆయన అకస్మిక మృతికి వారు సంతాపం వ్యక్తం చేశారు.
సంగీతాభిమానులకు తీరని లోటు అని తెలిపారు. ఆయన తన అనుభవంతో కొత్త పాత తరాల మధ్య వారధిగా నిలిచారని అన్నారు. యశ్వంత్ (ప్రెసిడెంట్), హరినాథ్ (వైస్ ప్రెసిడెంట్), సుమంత్ (సెక్రటరీ), కొండల్ (ట్రెజరర్), అరుణ్ (జాయింట్ సెక్రటరీ), స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి, కామేష్, కళ్యాణ్, శిరీష, అడ్వయిజరీ బోర్డ్కు చెందిన జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, కరుణ్ వెలిగేటి, కల్చరల్ కమిటీ శ్రీదేవి, శీలు, దీప్తి. నామినేటెడ్ కమిటీ సభ్యులు హరి, వరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టాలీవుడ్ సింగర్ శ్రీకృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎస్‍పిబి గారి ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఆయన తనకు మార్గదర్శనంగా నిలిచారని చెప్పారు.
కరవోకె కార్యక్రమాల సమన్వయకర్త, బాటా అడ్వయిజర్ ప్రసాద్ మంగిన గాయనీ గాయకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు గాయనీ గాయకులు బాలు మృతిని నమ్మలేకపోతున్నామని తామంతా దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ బాలుగారు పాడిన పాటలను పాడారు. శ్రీకాంత్ సందుగు, మురళీ సంబర, రవి గూడిపాటి, శ్రీకృష్ణన్, కృష్ణ రాయసం, త్రినాథ్‍రావు, మానస గాడేపల్లి, విజయ గోపరాజు, ప్రసాద్ మంగిన, సంజన తోడుపునూరి, కృతిక బురెడ్డి, మాధవ్ దంతూరి, శోహిణి చక్రవర్తి, అనిక ప్రసాద్, ప్రకాష్ కోట్ల, సంజిబ్ గోస్వామి, మోనిమాల, నవ్య వేమూరి, ఇషా వర్కుర్, శృతి ఎన్. అశ్విన్ ఖండేశ్వర్, శ్రీనివాస్ నల్లాన్, అంకిత జగన్, రామకృష్ణన్ వి, ప్రసాద్ బి, జానకి నిట్టల, మాల తంగిరాల, కిషోర్ నిట్టల, నవీన్, చంద్ర చావలి పాటలను పాడారు.
ఆయన పాటలు ఉన్నంతవరకు ఆయనకు మరణం లేదని పలువురు పేర్కొన్నారు.