ఘనంగా ఎఐఎ దసరా, దీపావళి వేడుకలు

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ), ఇండియన్ కాన్సులేట్, శాన్‍ఫ్రాన్కిస్కో ఆఫీస్, బాలీ 92.3 ఆధ్వర్యంలో బే ఏరియాలో జరిగిన దసరా, దీపావళి ధమాకా అందరినీ ఎంతగానో అలరించింది. కోవిడ్ 19 పరిస్థితుల కారణంగా ఈ వేడుకలను నవంబర్ 8వ తేదీన కొద్దిమంది అతిధులతో, సోషల్ డిస్టెన్స్ పాటటిస్తూ, మాస్క్ లు ధరించి నిర్వహించారు. ఈ వేడుకలను ఫేస్‍బుక్ లైవ్, జూమ్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఇతర ఛానళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. వేలాదిమంది ఈ కార్యక్రమాన్ని ఆన్‍లైన్ ద్వారా చూడటంతోపాటు వేడుకల్లో పాలుపంచుకున్నారు. బే ఏరియాలోని దాదాపు 35కిపైగా భారతీయ సంఘాలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేశాయి. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన వేడుకలు, సాంసంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
సంజీవ్ గుప్తా సిపిఎ ఈ కార్యక్రమానికి గ్రాండ్‍స్పాన్సర్‍గా, శ్రీనిగోలి (రియల్ ఎస్టేట్స్), రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, పిఎన్‍జి జూవ్వెల్లర్స్ స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికైన పలువురు ప్రజా ప్రతినిధులు, అతిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ కాన్సల్ జనరల్ డా. టీవి. నాగేంద్ర ప్రసాద్, సతీమణి టి. పద్మ, యుఎస్ కాంగ్రెస్‍మెన్ రో ఖన్నా, కాలిఫోర్నియా స్టేట్ సెనెటర్ -ఎలెక్ట్ దేవ్ కర్టెసీ, కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ మెంబర్ బిల్ క్విర్క్, కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ మెంబర్ యాష్ కల్రా, శాంతాక్లారా కౌంటీ సూపర్‍వైజర్ -ఎలెక్ట్ ఒట్టో లీ, మిల్‍పిటాస్ సిటీ మేయర్ రిచ్ ట్రాన్, ఫ్రీమాంట్ సిటీ మేయర్ లిలిమే, ఫ్రీమాంట్ సిటీ కౌన్సిల్ మెంబర్ రాజ్ సల్వాన్, శాన్‍రామన్ సిటీ కౌన్సిల్ మెంబర్ – ఎలెక్ట్ శ్రీధర్ వెరోజ్ తదితరులు మాట్లాడుతూ, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆన్‍లైన్ ద్వారా డ్యాన్స్ పోటీలను నిర్వహించారు.
ఈ వేడుకల్లో నిర్వహించిన పికెల్ ఫెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. పికెల్, చట్నీస్, పౌడర్స్ తయారు చేయడంలో నిర్వహించిన పోటీల్లో ఎక్కువమంది పాల్గొన్నారు. శ్రీమతి టి. పద్మ సూచనలతో, ఇండియన్ కాన్సులేట్ ఎస్‍ఎఫ్‍ఓ ఆఫీస్, ఎఐఎ టీమ్ ఈ పోటీలను నిర్వహించింది. చాలామంది తమకు నచ్చిన విధంగా చట్నీలు, పికెల్స్ ను, ఫౌడర్ లను తయారు చేశారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినవారు చాలారౌండ్ల తరువాత విజేతలను సెలెక్ట్ చేశారు. కాన్సల్ జనరల్ అంబాసిడర్ టీవి నాగేంద్ర ప్రసాద్, శ్రీమతి టీ పద్మ విజేతలకు బహుమతులను, ప్రశంసాపత్రాలను అందజేశారు. చివరగా ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ ఎఐఎ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది.