Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Religious » Grand welcome and historic first ever visit discourse by hh sri chinna jeeyar swamiji captivates scotland uk

Bo’ness: శ్రీ చిన్న జీయార్ స్వామిజీ బో’నెస్‌లో వైభవవంత స్వాగతం… తొలి స్కాట్లాండ్ ఉపన్యాసం ఘన విజయం

  • Published By: techteam
  • July 3, 2025 / 08:22 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Grand Welcome And Historic First Ever Visit Discourse By Hh Sri Chinna Jeeyar Swamiji Captivates Scotland Uk

బో’నెస్, జూన్ 29, 2025: భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామి (HH Sri Chinna Jeeyar Swamiji) కి 29 జూన్ సాయంత్రం ఘన సంప్రదాయ స్వాగతం పలికింది. 29 జూన్ బో’నెస్ టౌన్ హాల్‌లో ఆయన తొలి స్కాట్లాండ్ ఉపన్యాసాన్ని 500 మందికి పైగా భక్తుల సమక్షంలో నిర్వహించారు.

Telugu Times Custom Ads

స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి తాజా పూలమాల సమర్పించగా, అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి (విజయ్ కుమార్ రాజు పర్రి కుమారుడు) స్కాటిష్ కళ ఐనటువంటి బ్యాగ్‌పైప్ ప్రదర్శనను స్థానిక కళాకారులతో కలిసి ఆకట్టుకునేలా ప్రర్శించారు!

తరువాత ప్రసాద్ మంగళంపల్లి మరియు ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయబద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమం నిజరూపం దాల్చడంలో రాజశేఖర్ జాల JET UK వారితో సమన్వయం చేస్తూ ముఖ్యభూమికను పోషించారు.

వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన కార్య‌క్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి.

ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన “భువన విజయం” అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు.

కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు మరియు ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.

“పుష్ప స్వాగతం నుండి ప్రసాదం యొక్క చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి మరియు ఐక్యతతో మిళితం చేసింది” అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు.

జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంశా పత్రరూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు.
“ఏడు కొండల (తిరుపతి) నుండి ఏడు కొండల (ఎడింబర్గ్) వరకు” అని భువన విజయం వారు అందులో పోల్చుతూ ప్రచురించిన తీరు అద్భుతం.

“ఇది స్కాట్లాండ్ మరియు బో’నెస్‌ను రంగులతో నింపిన అద్భుత సంప్రదాయ వేడుక” అని ఒక వీక్షకుడు పలికిన మాట ఈ ఘనతను మరింత విస్మయపరుస్తోంది.

 

 

Tags
  • HH Sri Chinna Jeeyar Swamiji
  • Scotland
  • UK

Related News

  • Tana Mid Atlantic Diwali Ladies Night In Pennsylvania

    TANA: హుషారుగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ లేడీస్ నైట్

  • Huge Relief For Indian Techies Students As Us Announces Exemptions To H 1b Visa Fees

    H1B Visa: భారతీయ టెకీలకు భారీ ఊరట.. హెచ్ 1 బీ వీసా నిబంధనల నుంచి పలువర్గాలకు మినహాయింపు

  • Historic First Diwali Celebration At Indian Consulates New San Francisco Office

    Diwali: శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కొత్త ఆఫీసులో ఘనంగా దీపావళి వేడుకలు

  • Praveen Chinta As The Convener Of Tta Mega Convention

    TTA: టిటిఎ మెగాకన్వెన్షన్‌ కన్వీనర్‌ గా ప్రవీణ్‌ చింతా.. ఛార్లెట్‌ టిటిఎ బోర్డ్‌ సమావేశంలో నిర్ణయం

  • Nats Dallas Chapter Adopt A Park In Frisco

    NATS: ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్

  • Sankara Nethralaya Mesu Adopt A Village Eye Camp Sponsors Meet And Greet

    Sankara Nethralaya: దాతృత్వ దూరదృష్టికి ఘన నివాళి: జన్మభూమి రుణం తీర్చుకుంటున్న దాతలు

Latest News
  • Nara Lokesh: గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో లోకేష్ భేటీ
  • Dubai: నేటి నుంచి సీఎం చంద్ర‌బాబు ..  యూఏఈ పర్యటన
  • Jamaica: గుంటూరు వైద్యుడికి జమైకాలో అరుదైన గౌరవం
  • Rayavaram: వారికి 15 లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు
  • CPI: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య
  • Jubilee Hills: కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు : కిషన్‌ రెడ్డి
  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు
  • NRI: తగ్గిన ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు
  • Bison: ‘బైసన్’ తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది.. హీరో ధృవ్ విక్రమ్
  • TANA: హుషారుగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ లేడీస్ నైట్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer