రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో ఆన్‌లైన్ కీలకపాత్ర

అన్నీరంగాల్లో ఆన్‌లైన్‌కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆన్‌లైన్ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి మిగతా విషయాలకు ఆన్‌లైన్ మీదనే ఆధారపడుతున్నారు. దాంతో ఆన్‌లైన్ వాటా బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్‌లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని సీఐఐ`అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడిరచింది. పటిష్టమైన ఆన్‌లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారని పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది. అలాగే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5%–%2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, త ృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపిస్తున్నారు. 41% మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53 శాతం మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతుకుతున్నారు. 65 శాతం మంది వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుంటే.. 68 శాతం మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77% మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాధమ్యాలుగా ఉన్నాయి.