గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలపై అవగాహన అవసరం- శేఖర్ రెడ్డి

గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలపై పూర్తి అవగాహన ఉండాలని హైదబారాద్ చాప్టర్ ఐజీబీసీ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మాదాపుర్‌లోని సీఐఐలో వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్- 2018 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హానికరమైన రంగులు, భవన నిర్మాణానికి కావాల్సిన వస్తువులను త్వరగా పనులు జరుగుతాయనే ఉద్దేశంతో వాటితో నిర్మాణం చేస్తున్నామన్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. మనం ఎంపిక చేసుకునే ప్రతి వస్తువు గ్రీన్ బిల్డింగ్‌కు సంబంధించిదిగా ఉండాలన్నారు. కిచెన్, వంటగది అందులో వ్యర్థాలు, గ్రీన్ పెయింటింగ్, గ్రీన్ ట్యాప్‌లను వాడాలన్నారు. వీటిని వాడడం వల్ల తక్కువ నీటి సామర్థ్యంతో ఎక్కువగా పనులు చేసుకోవచ్చన్నారు. సిమెంట్, ప్లాస్టిక్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుంచి 3 వరకు గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. స్కూళ్లు, హౌస్‌లు, ఇతర ఫ్యాక్టరీ నిర్మాణాలు, గ్రీన్ బిల్డింగ్ పద్ధతిలోనే నిర్మించుకోవడం వల్ల ప్రకృతి వనరులను కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీఐఐ ప్రిన్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ నెల 24 నుంచి 30 వరకు ప్రపంచ హరితభవనాల వారోత్సవాలు జరుపుకొంటున్నాం. ఈ ఏడాది థీమ్ హోమ్ గ్రీన్‌హోవ్. హరితభవనాల నిర్మాణాల్లో ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లోనూ వీటికి స్పందన బాగుంది. సాధారణ భవనాల నిర్మాణంతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణ వ్యయం ఎక్కువ. ఇటీవల ఈ వ్యయం 2 నుంచి 3 శాతం తగ్గింది. ప్రభుత్వ ప్రోత్సహకాలు కూడా తోడైతే ప్రతి భవనాన్ని హరితంగా చేపట్టేందుకు డెవలపర్లు ముందుకు వస్తారు. కొనుగోలుదారులు సైతం మెరుగైన వాతావరణంలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు కాబటి వీటిని మార్కెట్ చేయడం కూడా సులువు అని ఐజీబీసీ చైర్మన్ సి. శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.