UGC Guidelines :యూజీసీ గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నాం .. తెలంగాణ

వీసీల నియామకంలో యూజీసీ గైడ్‌లైన్స్ (UGC Guidelines )పై తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పందించింది. గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి (Balakrishna Reddy) తెలిపారు. వీసీలు గా బ్యూరోక్రాట్స్‌ను నియమించాలనుకోవడం సరికాదన్నారు. యూజీసీ గైడ్‌లైన్స్, ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. యూజీసీ గైడ్‌లైన్స్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర యూనివర్సిటీ (State University )లను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలున్నాయి. వర్సిటీలు స్వతంత్రంగా ఉండాలి. ఈ అంశంపై మేం ఒక కమిటీ వేసుకున్నాం. కమిటీ ఇచ్చే రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. వర్సిటీల్లో ఖాళీల భర్తీపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం అని బాలకృష్ణారెడ్డి తెలిపారు.