Hyd: హైదరాబాద్లో ‘చిన్మయ ఎక్స్పీరియన్స్’ ప్రారంభించిన చిన్మయ మిషన్ – ఏఐ ఆధారిత ఆధ్యాత్మిక అనుభూతి స్టాళ్లు
చిన్మయ మిషన్ స్థాపనకు 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత మహోత్సవ్ వేడుకలలో భాగంగా, చిన్మయ మిషన్ గ్రేటర్ హైదరాబాద్ ఇవాళ ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్ లో అత్యాధునిక ఏఐ (AI), వీఆర్ (VR) సాంకేతికతలతో రూపొందించిన ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి కేంద్రం ‘చిన్మయ ఎక్స్పీరియన్స్’ ను ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి చిన్మయ మిషన్ గ్లోబల్ హెడ్ పూజ్య స్వామి స్వరూపానంద జీ తో పాటు, స్వామి బోధమయానంద జీ, డైరెక్టర్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, రామకృష్ణ మఠం, హైదరాబాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సాంప్రదాయ మంత్రోచ్చారణలతో పాటు పూర్ణకుంభం తో కార్యక్రమం ప్రారంభమై, అనంతరం చిన్మయ వాణి బుక్ స్టోర్, చిన్మయ ఉపహార్ మెర్చండైజ్ స్టాల్, మరియు చిన్మయ మిషన్ గ్రాస్రూట్ కార్యకలాపాల స్టాల్ లను ప్రారంభించారు. అనంతరం అతిథులు స్టాళ్లను సందర్శించి, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఆకర్షణీయమైన, ఇంటరాక్టివ్ ప్రదర్శనలను ఆస్వాదించారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఏఆర్ (AR) మరియు వీఆర్ (VR) ఆధారిత అనుభూతి స్టాల్. ఇది సందర్శకులకు ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అందించే అత్యాధునిక సాంకేతిక కేంద్రం. ఈ స్టాల్లో పూజ్య గురుదేవ్ స్వామి చిన్మయానంద వారి జీవితం, బోధనలు, అలాగే ప్రత్యేకంగా రూపొందించిన చిన్మయ మిషన్ 75 సంవత్సరాల ప్రయాణ కాలరేఖ ను ప్రదర్శించడంతో పాటు, ఆధునిక సాంకేతికతను శాశ్వతమైన వేదాంత జ్ఞానంతో మేళవించారు.
ఈ వేడుకల రెండు రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో సందర్శకులు మొత్తం నాలుగు ముఖ్య స్టాళ్లను సందర్శించవచ్చు.
వీటిలో ఆధ్యాత్మిక విద్యను అందించే ఏఆర్ & వీఆర్ అనుభూతి స్టాల్, భక్తి గ్రంథాలు, వేదాంత సాహిత్యం, పిల్లల కోసం పుస్తకాలు కలిగిన చిన్మయ బుక్ స్టాల్, చిన్మయ ఉపహార్ మెర్చండైజ్ స్టాల్, అలాగే చిన్మయ మిషన్ యొక్క సామాజిక సేవా మరియు గ్రాస్రూట్ కార్యక్రమాలను ప్రతిబింబించే ఇతర స్టాళ్లు ఉన్నాయి.
సమావేశంలో మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన పూజ్య స్వామి స్వరూపానంద జీ, చిన్మయ మిషన్ 75 సంవత్సరాల స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, వేదాంత ఆధారిత ఆధ్యాత్మిక విద్యపై సంస్థ అంకితభావం, అలాగే ‘చిన్మయ ఎక్స్పీరియన్స్’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఆధునిక సమాజంలో చిన్మయ మిషన్ ప్రాధాన్యతను వివరించారు.
స్వామి బోధమయానంద జీ కూడా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, విలువల ఆధారిత విద్య, ఆధ్యాత్మిక శక్తివంతీకరణ మరియు నిస్వార్థ సేవల ద్వారా దేశ నిర్మాణంలో చిన్మయ మిషన్ అందిస్తున్న విశిష్ట సేవలను ప్రశంసించారు.
కార్యక్రమం శాంతి మంత్రోచ్చారణ మరియు సామూహిక ప్రతిజ్ఞతో ముగిసింది. ఇది వ్యక్తిగత అంతరంగిక పరివర్తనతో పాటు సామాజిక సౌహార్దానికి చిన్మయ మిషన్ కలిగిన దృష్టిని మరింత బలపరిచింది. ప్రారంభోత్సవం అనంతరం చిన్మయ ఎక్స్పీరియన్స్ స్టాళ్లు ప్రజలకు అందుబాటులోకి తెరవగా, సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది.
అమృత మహోత్సవ్ వేడుకలలో భాగంగా, రేపు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సాన్నిధ్యంలో మెగా భగవద్గీతా పారాయణ కార్యక్రమం ను చిన్మయ మిషన్ గ్రేటర్ హైదరాబాద్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 50,000 మందికి పైగా పాల్గొని పవిత్ర శ్లోకాలను సామూహికంగా జపించనున్నారని, ఇది ఈ ప్రాంతంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమూహ కార్యక్రమాలలో ఒకటిగా నిలవనుంది.
జనవరి 24 మరియు 25, 2026 తేదీలలో ఈ వేడుకలు కొనసాగుతూ, ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక సందర్భానికి అనుసంధానించడంలో చిన్మయ మిషన్ యొక్క శాశ్వత వారసత్వాన్ని మరొకసారి చాటనున్నాయి.






