Revanth Reddy: భారత్‌కు బలమైన క్రీడా వేదిక కావాలి .. అందులో తెలంగాణ : రేవంత్ రెడ్డి

ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్‌ఐసీసీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ నీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా విధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని యువత పెడదోవ పడుతున్నారని, క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్లే యువత డ్రగ్స్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. చదువుల్లోనే కాదు, క్రీడల్లోనూ యువత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంతో పోటీపడే మనం, క్రీడల్లో వెనకబడి ఉండడం బాగాలేదన్నారు. భారత్‌కు బలమైన క్రీడా వేదిక కావాలని, అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని పేర్కొన్నారు.