Vinod kumar :తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర కీలకం :వినోద్‌కుమార్

తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్(Vinod kumar) కొనియాడారు. బీఆర్‌ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి(Naveen Reddy) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా నిర్వహించే యూకే కార్యవర్గ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్(Kurmachalam Anil) తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ (KCR) నాయతక్వంలేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ (BRS) పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందు నిలిచి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల తర్వాత మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని, అప్పటి వరకు ఎన్నారైలు ప్రజాసమస్యలపై నిత్యం గళమెత్తాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్‌ఎస్ సెల్ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు హరిగౌడ్, సతీశ్‌రెడ్డి గొట్టిముక్కల, సత్యమూర్తి చిలుములు, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల పాల్గొన్నారు.