Vijayashanti : అందుకే సైలెంట్‌గా ఉన్నా : విజయశాంతి

ఒక ఆలోచన, ముందుచూపుతో రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి (Vijayashanti) అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేర్చుతుందని అన్నారు. నేను గతంలోనూ కాంగ్రెస్ (Congress) లో పనిచేశాను. కానీ, ఏనాడూ ఇది కావాలని పార్టీని అడగలేదు. పార్టీ హైకమాండ్ నాకు అవకాశం ఇచ్చినా, నాకు వద్దు నేను ముందు పనిచేస్తా అని అన్నాను. గతంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆహ్వానం మేరకు నేను తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఎవరికీ ఏ బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అదే ఇస్తుంది. పార్టీలో ఉన్నవారందరూ కాస్త ఓపిక పట్టాలి. పార్టీ నాకు ఎప్పుడు బాధ్యతలు అప్పగిస్తుందో, అప్పుడే మాట్లాడాలి, పని చేయాలి అనుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూశాను. కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంది. అది మీరకుండా ప్రతిఒక్కరూ పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా పోరాడుతాం అని అన్నారు.