Vanguard :హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ : సీఎం రేవంత్

హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (Global Capability Center) ఏర్పాటు చేయబోతున్నట్లు వ్యాన్‌గార్డు (Vanguard) సంస్థ ప్రకటించింది. దేశంలోనే తొలి కార్యాలయాన్ని హైదరాబాద్ (Hyderabad) లోనే స్థాపించనున్నట్లు వెల్లడిరచింది. వ్యాన్‌గార్డు కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ని కలిశారు. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే 2500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏఐ(AI), డేటా సెంటర్ (Data Center) , మొబైల్ ఇంజినీరింగ్ నిపుణులకు అవకాశాలు లభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. హైదరాబాద్‌లో అన్ని రంగాల నిపుణులు ఉన్నారని సీఈవో చెప్పారు. హైదరాబాద్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల హబ్‌గా చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు.