Vakiti Srihari: ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం: మంత్రి వాకిటి శ్రీహరి
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, యువజన క్రీడా సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్‌లతో కలిసి ఆయన (Vakiti Srihari) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, పోలీసులకు ఉత్తమ సేవా పతకాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన (Vakiti Srihari) పరిశీలించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని మంత్రి తెలిపారు. జిల్లాను, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన (Vakiti Srihari) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్. శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, ఆర్డీఓ రామచందర్, డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







