V Hanumantharao: డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: హనుమంతరావు

కేంద్రం చేపట్టబోయే జనగణనలో దేశవ్యాప్తంగా కులగణన కూడా చేయాలని, బీజేపీ తన నిజాయితీని చాటుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత వి. హనుమంతురావు (V Hanumantharao) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించారని, దాన్ని కేంద్రానికి పంపారని చెప్పారు. పార్లమెంట్‌లో కూడా ఈ బిల్లును ఆమోదించి అమలు చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు వీహెచ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన (V Hanumantharao) ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలని, కేంద్రానికి తమ అభ్యంతరాలను తెలియజేయాలని హనుమంతరావు పిలుపునిచ్చారు. కులగణన చేపట్టడం ద్వారా బీసీల వాస్తవ జనాభా బహిర్గతమవుతుందని, వారికి న్యాయం జరిగే అవకాశముందని ఆయన (V Hanumantharao) అభిప్రాయపడ్డారు.