Uttam Kumar Reddy: అందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు : మంత్రి ఉత్తమ్

ఎస్‌ఎల్‌బీసీ (SLBC) ప్రమాదస్థలి వద్ద రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy )సమీక్ష నిర్వహించారు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆయన చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సొరంగం (Tunnel) లో జరిగిన ప్రమాదాల్లో ఇలాంటి క్లిష్లమైన ప్రమాదం ఎక్కడా జరగలేదని చెప్పారు. 14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది. చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) చేసే వాళ్లకూ ప్రమాదం ఉంది. అందుకే రోబో (Robot) ల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకేచోట ముగ్గురు ఉన్నట్లు గుర్తించారు. ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం అని అన్నారు.