US Consul General : రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించిన యూఎస్ కాన్సుల్ జనరల్

యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్(Jennifer Larson) రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్(CMD Kiran), రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, డైరెక్టర్లు సహరి, బృహతిలను కలిశారు. ఇక్కడి ఈటీవీ భారత్ కార్యాలయాన్ని కూడా సందర్శించి మీడియా రంగంలో రామోజీ గ్రూప్ సంస్థల నిబద్ధతను కొనియాడారు. ఈటీవీ భారత్ కార్యకలాపాలను సంస్థ సీఈవో జొన్నలగడ్డ శ్రీనివాస్ (Jonnalagadda Srinivas) ఆమెకు వివరించారు. యూఎస్ కాన్సుల్ జనరల్ వెంట పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్ లారెన్, మీడియా అడ్వైజర్ అబ్దుల్ సమద్ ఉన్నారు.