Bandi Sanjay: 2026 మార్చి నాటికి మావోయిజం అంతం : బండి సంజయ్
అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో జల్సాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.1.5 కోట్ల విలువైన శస్త్రచికిత్సల వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేసి మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకొని కార్లలో (Cars) తిరుగుతున్నారు. వారి మాయమాటలు నమ్మి అమాయక దళిత, గిరిజనులు తుపాకీ పట్టుకొని తిండీ తిప్పలు లేక అడవుల్లో తిరుగుతూ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు అని అన్నారు. 2026 మార్చి నాటికి మవోయిజాన్ని అంతం చేసి తీరుతామన్నారు. గతంలో ఇక్కడ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణను తుపాకీతో చంపడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. హిడ్మా ఆయన భార్య సాధించిందేమిటని ప్రశ్నించారు. తుపాకీ పట్టుకొని చర్చలు జరుపుతామంటే ఒప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.






