Bandi Sanjay: ఎనిమీ ప్రాపర్టీస్ పై తక్షణమే సర్వే చేయండి : కేంద్రమంత్రి బండి సంజయ్

నెలాఖరులోపు స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కేసులను పరిష్కరించాలని అధికారులను కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ (Telangana)లోని ఎనిమీ ప్రాపర్టీస్ (Enemy Properties) కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన దీనిపై తక్షణమే సర్వే (Survey) చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 12,800 ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయని కేంద్రమంత్రికి అధికారులు తెలిపారు. 600 కు పైగా ప్రాపర్టీస్ వేలందశలో ఉన్నాయని వివరించారు. వేలం వేసిన ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పెండిరగ్ పైళ్లను వేగంగా క్లియర్ చేసిన అధికారులను కేంద్రమంత్రి అభినందించారు.