నాబార్డు కొత్త సీజీఎంగా ఉదయ్‌భాస్కర్

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) తెలంగాణ ప్రాంత నూతన సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్)గా బి.ఉదయ్‌భాస్కర్ హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో పీజీ చదివారు. 1993లో కర్ణాటకలోని నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో అధికారిగా విధుల్లో చేరి, 31 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు.