David Reddy: “డేవిడ్ రెడ్డి” నా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంది – మంచు మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా “డేవిడ్ రెడ్డి”. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా “డేవిడ్ రెడ్డి” సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు “డేవిడ్ రెడ్డి” సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ మాట్లాడుతూ – మనోజ్ గారి సినిమాల్లో యాక్షన్ కు స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. “డేవిడ్ రెడ్డి” మంచు మనోజ్ కు గొప్ప యాక్షన్ మూవీగా పేరు తెస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ – మనోజ్ గారిని మీరు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. ఇప్పుడు గ్లింప్స్ లో చూసింది ఒక పర్సెంట్ కూడా కాదు. సినిమా అంత బాగుంటుంది. మా కొత్త టీమ్ ను నమ్మి సినిమా చేసే అవకాశం ఇచ్చిన మనోజ్ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ హనుమ నా ఫ్రెండ్. ఒక కసితో ఈ సినిమాను రూపొందించాడు. రవి బస్రూర్, సుప్రీమ్ సుందర్..ఇలా ఒక మంచి టీమ్ ను పెట్టుకున్నాడు. ఈ టెక్నీషియన్స్ మా సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు. ఇకపై మా “డేవిడ్ రెడ్డి” సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ కు థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ భరత్ మోటుకూరి మాట్లాడుతూ – “డేవిడ్ రెడ్డి” సినిమాను కేవలం మనోజ్ గారు మాత్రమే చేయగలరు. అనేక ఇబ్బందులు పెట్టిన తర్వాత ఒకరి నుంచి పుట్టుకొచ్చే ఆవేశమే ఈ సినిమా. ఆ ఆవేశమే బ్రిటీష్ వారి మీద తిరగబడేలా చేసింది. ఈ సినిమాకు ఎలాంటి టెక్నీషియన్స్ కావాలో అలాంటి వారినే పర్పెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నాం. ఈ మూవీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మాట్లాడుతూ – కేజీఎఫ్ నుంచి నా మ్యూజిక్ ను అభిమానిస్తున్నారు. సలార్ తో ఆ ప్రేమను మరింతగా అందించారు. నా మ్యూజిక్ కు తెలుగు ఫ్యాన్స్ ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాను. “డేవిడ్ రెడ్డి” సినిమా కూడా మ్యూజిక్ పరంగా మీ అందరికీ ఫేవరేట్ అవుతుంది. ఈ సినిమా గ్లింప్స్ లో మీరు చూసింది చాలా కొంతే. మూవీలో మరింత మంచి కంటెంట్ చూస్తారు. అన్నారు.
డైరెక్టర్ హనుమరెడ్డి యక్కంటి మాట్లాడుతూ – డేవిడ్ రెడ్డి సినిమా సబ్జెక్ట్ చాలా పెద్దది. ఈ సినిమా కథ రెడీ అయ్యాక హీరో కోసం చూస్తున్నాను. భైరవం సినిమా చూసి మనోజ్ గారిని కాంటాక్ట్ అయ్యాను. ఒక చిన్న పోస్టర్ పంపించాను. ఆ పోస్టర్ చూసి వెంటనే కాల్ చేశారు. కథ విన్న వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. మనోజ్ గారు ఓకే అన్నాక టెక్నీషియన్స్ కోసం సెర్చ్ స్టార్ట్ చేశాను. రవి బస్రూర్ గారు, సుప్రీమ్ సుందర్ గారు, డీవోపీ ఆచార్య వేణు..ఇలా ప్రతి ఒక్కరూ పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టెక్నీషియన్స్. అయితే వీరంతా మా డేవిడ్ రెడ్డి కథ విని వెంటనే సంతోషంగా మూవీ చేసేందుకు ముందుకొచ్చారు. మనకు ఒకరే భగత్ సింగ్, ఒకరే సుభాష్ చంద్రబోస్, ఒకరే డేవిడ్ రెడ్డి. “డేవిడ్ రెడ్డి” నిజమైన పాన్ ఇండియా సినిమా. ఇది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఫిక్షనల్ క్యారెక్టర్ తో రాసిన స్క్రిప్ట్. మీరు గ్లింప్స్ లో చూసింది కొంతే. నేను డెబ్యూ డైరెక్టర్ ను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. మిగతాది మీరు సినిమాలో చూడండి. అన్నారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మీరు నాకు ఇన్నేళ్లుగా ఇస్తున్న ప్రేమ, అభిమానానికి పాదాభివందనం. హీరోగా సినిమాలు చేయి అని నన్ను నిత్యం ప్రోత్సహిస్తుంటారు మీరంతా. నేను ఎలాంటి సినిమాతో మళ్లీ హీరోగా రావాలని అనుకుంటున్న టైమ్ లో నా మిత్రుడు రామ్ ఫోన్ చేసి మంచి కథ ఉంది వినమని అన్నాడు. అదే డేవిడ్ రెడ్డి మూవీ. కథ విన్న వెంటనే నాకు బాగా నచ్చింది. నన్ను ఎలాంటి మూవీలో చూపిస్తే బాగుంటుందో, మీరు నన్ను ఎలాంటి మూవీలో చూడాలని అనుకుంటున్నారో అలాంటి స్టోరీని దర్శకుడు హనుమ రెడీ చేశారు. 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమాను ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ పెట్టి వెంకట్ రెడ్డి, భరత్ గారు ప్రొడ్యూస్ చేశారు. వాళ్లు డైరెక్టర్ హనుమ మీద పూర్తి నమ్మకంతో ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. డేవిడ్ రెడ్డి బ్రిటీష్ వారికే కాదు ఇండియన్స్ కూడా శత్రువే. డేవిడ్ రెడ్డికి పీస్ ఫుల్ గా ఉండటం రాదు, ఏదైనా వెళ్లి కొట్టి తెచ్చుకోవడమే తెలుసు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి నాతో మూవీ చేస్తున్న డైరెక్టర్ హనుమకు థ్యాంక్స్. అలాగే మా రవి బస్రూర్ గారు, సుప్రీమ్ సుందర్ గారు, ఎడిటర్ ఉజ్వల్ గారు, డీవోపీ ఆచార్య వేణు గారు వీళ్లంతా మా టీమ్ లో పార్ట్ అయినందుకు వారికి థ్యాంక్స్ చెబుతున్నా.
డేవిడ్ రెడ్డి బైక్ పేరు వార్ డాగ్, అతని చేతులో ఉన్న స్టిక్ పేరు డెత్ నోట్. ఇవి రెండు డేవిడ్ రెడ్డి ఆయుధాలు. ఇండియాకు స్వాతంత్ర్యం అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలి అనేది డేవిడ్ రెడ్డి దృక్పథం. బ్రిటీష్ వాళ్లు ఊళ్లకు ఊళ్లు తగలబెడుతుంటే ఆ హింసను హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా డేవిడ్ రెడ్డి కనిపిస్తాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, శింబు గెస్ట్ లుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కథలో గెస్ట్ రోల్స్ కు అవకాశం ఉంది. అయితే మేము ఇప్పటివరకు ఏ హీరోను అప్రోచ్ కాలేదు. ఆ డీటెయిల్స్ తర్వాత చెబుతాం. నేను సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్ చేసినప్పుడు నాకు సపోర్ట్ గా ఉండి నెత్తిమీద పెట్టుకున్నారు అభిమానులు. వాళ్లకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంది. చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలు, దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుంది అనేది మా డేవిడ్ రెడ్డి మూవీలో చూస్తారు. అన్నారు.






