శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్‌లో ఇక ప్రతి రోజూ

హైదరాబాద్ నగరంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతి రోజూ శ్రీవారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకూ శని, ఆదివారాక్లూ మాత్రమే విక్రయించే పరిస్థితి ఉండేది. శ్రీవారి లడ్డూల జారీలో టీటీడీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందని హిమాయత్ నగర్ టీటీడీ డిప్యూటీ ఏఈవో రమేష్ ఒక ప్రకనటలో తెలిపారు. ఇక నుంచి ప్రతిరోజూ శ్రీవారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని (రూ.50లకు ఒక లడ్డు) అందించనున్నామన్నారు. హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఈ లడ్డులను విక్రయించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆయా ఆలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.