Tirupatanna :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. తిరుపతన్నకు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న(Tirupatanna )కు సుప్రీంకోర్టు(Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. 10 నెలలుగా పిటిషనర్ జైలులో ఉన్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారన్నారు. ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. ట్రయల్‌కు తిరుపతన్న పూర్తిగా సహకరించాలి. జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దు. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించవచ్చు. పాస్‌పోర్టు(Passport) రద్దు సహా ఇతర బెయిల్ షరతులు అన్నింటినీ ట్రయల్ కోర్టు (Trial court) ఇస్తుంది అని సుప్రీంకోర్టు తెలిపింది.