Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడికి తొలిపూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేషుడికి (Khairatabad Ganesh) తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) తొలిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) , ఎంఎల్ఎ దానం నాగేందర్ (Danam Nagender) , కాంగ్రెస్ నేతలు, పూజారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖైరతాబాద్ గణేషుడికి దర్శించుకోవడానికి భక్తులు వర్షంలో కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు.ఈ సంవత్సరం బడా గణేషుడిని శ్రీ విశ్వశాంతి మహా గణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గణేషుడికి కుడివైపు శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ (Gajjalamma) ఉన్నారు.







