Revanth Reddy:హైదరాబాద్ అభివృద్ధి లో ఎంతో మంది పాత్ర : రేవంత్ రెడ్డి

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పాదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) న్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో (CREDAI Property Show) ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శతాబ్దాలుగా సాగిన హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధిలో ఎంతో మంది పాత్ర ఉందన్నారు. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకపోడంతో అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత నాది. దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నాం. స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన మేము, ఈ దేశ వాసులను ఎందుకు ప్రోత్సహించమో ఆలోచించాలి అని అన్నారు.
నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తాను. ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించి దాచుకునే ఆలోచన నాకు లేదు. గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు భారీగా రుణాలు తెచ్చింది. మేం పాత రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు రీషెడ్యూల్ చేయించాం. మెట్రో రైలు (Metro train) విస్తరణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మహారాష్ట్రలో 40 విమానాశ్రయాలుంటే, మనకు ఒక్కటే ఉంది. గత ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల గురించి పట్టించుకోలేదు. మేం కేంద్రాన్ని ఎన్నోసార్లు సంప్రదించి రెండు విమానాశ్రయాలు సాధించాం. త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్ (Adilabad)కు విమానాశ్రయాలు సాధిస్తాం. రీజినల్ రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్‌రోడ్డు రైలు రింగ్ కోసం కృషి చేస్తున్నాం అని తెలిపారు.