Sridharbabu : పదవీ విరమణ వయసు పై మంత్రి కీలక ప్రకటన

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు(Sridharbabu )కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో తన ఛాంబర్‌లో శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. పిబ్రవరి 7న ఐటీకి సంబంధించి పెద్ద ప్రకటన ఉండబోతోందని తెలిపారు. డ్రైపోర్ట్ లింక్ పరిష్కారమైంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Chief Ministers) మాట్లాడారు. తెలంగాణలో రెండు డ్రైపోర్ట్‌లు వస్తున్నాయి. టైర్-2 సిటీల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి చేస్తాం. ఐటీకి సంబంధించి ఈస్ట్ సిటీని అభివృద్ధి చేస్తాం. చర్లపల్లి (Cherlapalli) వద్ద పెద్దఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. గత బీఆర్‌ఎస్ (BRS) ఐటీ పాలసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఐటీ పాలసీని తీసుకొస్తాం. హైదరాబాద్ చుట్టూ ఐటీ అభివృద్ధి చేయబోతున్నాం. నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీ (Future City )ని అభివృద్ధి చేస్తాం. బీఆర్‌ఎస్ పదేళ్లలో తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే అధికంగా ఈ ఏడాదిలోనే వచ్చాయి. వీటిని గ్రౌండ్ చేయడానికి ఇప్పటికే దృష్టి సారించాం. ఔట్‌లుక్స్ మాల్స్ తరహాలో హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చే యోచనలో ప్రభుతవం ఉంది. మంత్రులు ఎవరూ అలక, అసంతృప్తిలో లేరు. ఆర్థిక పరిస్థితిపై అందరికీ అవగాహన ఉంది. అవినీతి ఆరోపణలు నిజం కాదు అని పేర్కొన్నారు.