Bhatti Vikramarka : తెలంగాణలో ఎకోరేస్ ఎనర్జీ సంస్థ … రూ.27వేల కోట్లు పెట్టుబడులు : భట్టి విక్రమార్క

తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీ రెడ్కో)తో ఎకోరేస్ ఎనర్జీ, జీపీఆర్‌ఎస్ ఆర్య సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమక్షంలో ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. రూ.27 వేల కోట్లతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ (Green energy) ఉత్పత్తికి ఎకోరేస్ ఇండియా (Ecorace India) ఒప్పందం కుదుర్చుకుంది. రూ.2వేల కోట్లతో 15 జిల్లాల్లో బయోగ్యాస్ ప్రాజెక్టులకు జీపీఆర్‌ఎస్ (GPRS) ఆర్య ఒప్పందం చేసుకుంది. అంతకుముందు బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకాన్ని సాధారణ సంక్షేమ పథకంగా చూడొద్దని బ్యాంకర్లను కోరారు. మానవీయ దృష్టితో రూపొందించిన ఈ పథకానికి సహకరించాలన్నారు. రాజీవ్ యువ వికాసం రాష్ట్రంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిపోతుందన్నారు.