Revanth Reddy: తెలంగాణ-కితాక్యూషు మధ్య సహకార ఒప్పందం : సీఎం రేవంత్ రెడ్డి

కితాక్యూషు నగరం ఎకో టౌన్ మోడల్‌తో చాలా ప్రేరణ పొందినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. జపాన్ (Japan)లోని కితాక్యూషు సిటీ మేయర్ కజుహిసా (Kazuhisa), జపాన్ బృందంతో ఐటీసీ కాకతీయలో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ, కితాక్యూషు పరస్పర సహకార ఒప్పందంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ భాగస్వామ్యంతో రాష్ట్ర పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నాం. కితాక్యూషు (Kitakyushu) నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్‌కు సరిపోయేలా ఉంది. తెలంగాణ-కితాక్యూషు సహకార ఒప్పందం జరగడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం మూసీ నది (Musi River) అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపై మా దృష్టి ఉంది. రాష్ట్ర యువతకు నైపుణ్య కల్పిచండం మా ప్రాధాన్యత. హైదరాబాద్ (Hyderabad) కితాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీకి ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.